Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ మర్డర్.. మ్యూజిక్ వీడియో కో-స్టార్ ఏమన్నాడంటే
Radhika Yadav: టెన్నిస్ స్టార్ రాధికా యాదవ్ ను తండ్రి కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ హత్యకు తనతో లింకు లేదని ఆమెతో కలిసి మ్యూజిక్ వీడియో తీసిన కోస్టార్ ఇనాముల్ హక్ తెలిపాడు. సాంగ్ షూట్ చేసిన తర్వాత ఆమెను మళ్లీ కలవలేదన్నాడు.
గురుగ్రామ్: టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్(Radhika Yadav)ను .. తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో కాల్చి చంపిన ఘటన తెలిసిందే. ఆ మర్డర్ వెనుక రాధిక నటించిన మ్యూజిక్ వీడియో కారణమై ఉంటుందని కొన్ని కోణాల్లో భావిస్తున్నారు. ఇనాముల్ హక్ అనే వ్యక్తితో కలిసి రాధికా.. ఆ రొమాంటిక్ మ్యూజిక్ వీడియో తీసింది. ఆ సాంగ్‌ను తొలుత తన ఇన్‌స్టాలో పబ్లిష్ చేసింది. ఆ తర్వాత ఆ ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్యకు, తనకు ఎటువంటి లింకు లేదని ఆమెతో కలిసి సాంగ్‌లో నటించిన ఇనాముల్ హక్ తెలిపాడు. ఆ పాటను షూట్ చేసిన తర్వాత రాధికను మళ్లీ కలవలేదన్నాడు.
ఢిల్లీలో జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సమయంలో రాధికతో పరిచయడం ఏర్పడిందని, ఆ తర్వాత ఇద్దరం కలిసి మ్యూజిక్ వీడియో చేశామని, ఆ తర్వాత ఇద్దరు వేరు అయ్యామని ఇనాముల్ హక్ తెలిపాడు. మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం తన తల్లితో కలిసి రాధిక వచ్చిందని, ఆమెకు పేమెంట్ కూడా ఇచ్చామని, ఆ తర్వాత ఇద్దరం ఎప్పుడూ కలుసుకోలేదని ఇనాముల్ చెప్పాడు. రాధికా యాదవ్‌తో పర్సనల్ రిలేషన్ ఉందని వస్తున్న వదంతులను అతను కొట్టిపారేశాడు. ఆ రూమర్స్‌లో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలన్నాడు. మా మధ్య స్నేహం కానీ, రిలేషన్ కానీ లేదన్నాడు. ఓ వీడియో ప్రాజెక్టు కోసం.. ఆమె కేవలం తనతో నటించినట్లు చెప్పాడు.
రాధికా యాదవ్ మృతికి.. మతపరమైన కోణాన్ని జోడించడం పట్ల అతను ఆందోళన వ్యక్తం చేశాడు. దీన్ని హిందూ-ముస్లిం గొడవగా ఎందుకు చిత్రీకరిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. దీంట్లో తన పాత్రేమీ లేదన్నాడు. మ్యూజిక్ వీడియో సాంగ్‌ను తండ్రి మెచ్చుకున్నట్లు రాధిక తనతో సెట్స్‌లో చెప్పిందని ఇనాముల్ గుర్తు చేశాడు. అంటే ఆ సాంగ్‌కు ఫ్యామిలీ సపోర్టు ఉందని అర్థమైందన్నాడు. కానీ రాధిక తన ఇన్‌స్టా అకౌంట్‌ను కొన్నిసార్లు డీయాక్టివ్, రీయాక్టివ్ చేసిందన్నాడు. ఈ కేసులో తనను పోలీసులు ఇంకా ప్రశ్నించలేదన్నాడు. ఒకవేళ పోలీసులు దర్యాప్తుకు రమ్మంటే వెళ్తానని చెప్పాడు. వీడియోకు మంచి గుర్తింపు రాలేదని, అందుకే దాన్ని తొలగించాలనుకున్నాని, మరో టీమ్‌తో ఆ సాంగ్‌ను రీ రిలీజ్ చేయాలనుకున్నట్లు అతను చెప్పాడు.
గురుగ్రామ్ సెక్టార్ 57లో ఉన్న ఇంట్లో.. రాధికను తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపాడు. శుక్రవారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. పలుచోట్ల రాధికకు తుపాకీ తూటాలు దిగినట్లు డాక్టర్లు చెప్పారు. అటాప్సీ టైంలో నాలుగు బుల్లెట్లు తీసినట్లు డాక్టర్లు తెలిపారు. టెన్నిస్ అకాడమీ నడిపిస్తున్న కూతురు రాధికతో తండ్రికి విబేధాలు తలెత్తినట్లు పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు. కానీ సోషల్ మీడియాలో ఉన్న మ్యూజిక్ వీడియోను తొలగించాలని రాధికపై తండ్రి వత్తిడి తీసుకువచ్చినట్లు కొన్ని దర్యాప్తు కోణాల్లో తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

