న్యూఢిల్లీ, జూలై 16: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ట్రంక్ పెట్టె నుంచి నీట్-యూజీ పేపర్ కాజేసిన కీలక నిందితుడిని సీబీఐ ఆరెస్ట్ చేసింది. అతడితో పాటు అతడికి సహకరించిన రాజు సింగ్‌ను హజారీబాగ్‌లో అదుపులోనికి తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ మంగళవారం వెల్లడించింది.
వీరిద్దరి అరెస్ట్‌తో నీట్ లీకేజీ, అక్రమాల కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 14కి పెరిగింది. నీట్ పేపర్ కాజేసిన పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య జంషెడ్పూర్ ఎన్ఐటీలో 2017లో సివిల్ ఇంజినీరింగ్ చదివారని సీబీఐ అధికారులు తెలిపారు. బొకారోలో నివసించే అతడిని పాట్నాలో అరెస్ట్ చేశామని వెల్లడించారు.