ముంబై: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణించిన హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు చెక్ చేశారు. అందులో ఉన్న ఆయన బ్యాగులను తనిఖీ చేశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Amit Shah Helicopter Checked) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో అమిత్ షా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను, అందులోని బ్యాగులను ఎన్నికల కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు.
కాగా, అమిత్ షా ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ‘ఈ రోజు మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల అధికారులు నా హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల విధానాన్ని బీజేపీ విశ్వసిస్తుంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను అనుసరిస్తుంది’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు ఎన్నికల వ్యవస్థకు మనమంతా సహకరించాలని, భారతదేశాన్ని ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్యంగా ఉంచడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలని అమిత్ షా తెలిపారు. హెలికాప్టర్‌ను, బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేసిన వీడియోను ఆయన షేర్ చేశారు.
आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई।
भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है।
एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT
— Amit Shah (@AmitShah) November 15, 2024