
బలరాంపూర్, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్లోని ఐదు నదులను అనుసంధానం చేస్తూ నిర్మించిన ‘సరయు కెనాల్’ జాతీయ ప్రాజెక్టును ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో 14 లక్షల హెక్టార్లకు సాగు నీరు అందుతుందని తెలిపారు. తూర్పు ఉత్తరప్రదేశ్లోని 29 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల అలసత్వం వల్ల ప్రాజెక్టు ఖర్చు 100 రెట్లు పెరిగిందని ధ్వజమెత్తారు. ఈ కెనాల్ ఘాఘ్రా, సరయు, రాప్తి, బంగంగ, రోహిణి నదులను కలుపుతుంది. దీని నిర్మాణానికి రూ.9,800 కోట్లు ఖర్చు అయింది. కాగా, తమ హయాంలోనే ప్రాజెక్టు పనుల్లో మూడొంతులు పూర్తైందని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) తెలిపింది.