న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల ఫీట్లతో కూడిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తుండగా తాజాగా మరో వీడియో (viral video) నెట్టింట తెగ వైరలవుతోంది. మెట్రో కోచ్‌లు, స్టేషన్ల వద్ద పలువురు డ్యాన్స్ వీడియోలు చేస్తుండగా మరికొందరు తోటి ప్రయాణీకులతో ఘర్షణ పడుతున్న వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. ఇక మెట్రో కోచ్‌ల్లో కొందరు అభ్యంతరకరంగా వ్యవహరించిన వీడియోలు సైతం నెట్టింట వైరలయ్యాయి.
తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువతి డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను ఇన్స్టాగ్రాం యూజర్ ఇట్స్_అఫిషియల్రాయ్ షేర్ చేయగా ఈ క్లిప్‌పై నెటిజన్లు తలో రకంగా రియాక్టయ్యారు. యస్..దీన్ని అనుమతించరని నాకు తెలుసు..అయినా ఢిల్లో మెట్రోలో తొలిసారి ఇలా చేశానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
మెట్రోలో ప్రయాణించేందుకు అధికారులు నిర్ధేశించిన నిబంధనలు తెలిసినా మహిళ ఎందుకు అక్కడ డ్యాన్స్ రీల్ చేయాల్సి వచ్చిందని పలువురు సందేహం వ్యక్తం చేశారు. ఈ వీడియోలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొందరు నెటిజన్లు ఈ పోస్ట్‌ను డీఎంఆర్సీ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాకు ట్యాగ్ చేశారు. ఇక ఇటీవల ఓ యువతి మినీ స్కర్ట్‌తో ఢిల్లీ మెట్రోలో కనిపించడం కలకలం రేపింది.
Read More