న్యూఢిల్లీ : పులి అనగానే అడవిలో ఇతర జంతువులు హడలిపోతుంటాయి. పులి తిరుగాడే ప్రదేశాల్లో సంచరించేందుకూ అవి సంకోచిస్తాయి. అలాంటిది ఓ జింకకు ఎలాంటి హాని తలపెట్టకుండానే పులి దాని పక్కగా వెళుతున్న వీడియో (viral video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో అటవీ మార్గంలో పులి కూర్చుని ఉండగా దానికి దగ్గరలో జింక నిలుచుని ఉంటుంది.
The tiger is a monk. It won't bother you, or be bothered by you. It tries to maintain its composure as much as it can. Even if you are around it, it will most likely be unfazed. And even when a tiger expresses its aggression, it is mock. It's a construct. pic.twitter.com/FcxsduIMx2
— Ramesh Pandey (@rameshpandeyifs) March 1, 2023
ఆపై పులి మెల్లిగా జింకను దాటుకుంటూ వెళుతుండటం కనిపిస్తుంది. జింకపై పులి దాడి చేయకుండా తన దారిన తాను వెళుతుండటం ఈ వీడియోలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పులి సన్యాసి. ఇది మీకు ఇబ్బంది కలిగించదు, లేదా మీరు దానికి ఇబ్బంది కలిగించరు.
వీలైనంత వరకు తన ప్రశాంతతను కాపాడుకోవడానికి పులి ప్రయత్నిస్తుందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను తొలుత ఉత్తరాఖండ్ అటవీ పరిశోధనా కేంద్రం షేర్ చేసింది. ఈ వీడియో ఆన్లైన్లో 14,000కుపైగా వ్యూస్‌ను రాబట్టింది. పులి సన్యాసిగా వ్యవహరించిన తీరు నెటిజన్లకు విస్తుగొలిపింది.
Read More :
King Cobra | వామ్మో.. ఎంత పెద్ద కింగ్ కోబ్రానో.. వీడియో వైరల్