న్యూఢిల్లీ : ఓ డ్యామ్‌లోని నీటి ప్రవాహంలో చిక్కుకున్న కుక్కను తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపదలో చిక్కుకున్న జంతువును సకాలంలో కాపాడి ఒడ్డుకు చేర్చిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
आपकी डिग्री सिर्फ़ एक कागज का टुकड़ा है
आपकी असली शिक्षा आपके व्यवहार से दिखती है
🙏❤️👏 pic.twitter.com/Ngsc0tqSt8— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 15, 2022
ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ లక్ష మందికి పైగా వీక్షించారు. వైరల్ వీడియోలో రోప్ సాయంతో డ్యామ్‌లోకి దిగి కుక్కను కాపాడటం కనిపిస్తుంది. వీడియోలో సాయం కోసం కుక్క గట్టిగా అరవడం వినిపిస్తుంది.
కుక్కను ఆపద నుంచి కాపాడేందుకు వ్యక్తి తన ప్రాణాన్ని లెక్కచేయకుండా ప్రయత్నించడం నెటిజన్లను ఆకట్టుకుంది. అవసరమైతే అతడికి సాయం చేసేందుకు సిద్ధంగా మరికొందరు ఘటనా ప్రాంతంలో కనిపించారు. పలు అవరోధాల తర్వాత ఆ వ్యక్తి కుక్కను కాపాడి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు.