న్యూఢిల్లీ : బైక్‌పై వెళ్లేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి తన హెల్మెట్‌లో పామును చూసి షాక్ తిన్నాడు. 1.2 లక్షల మంది ఫాలోయర్లు కలిగిన ఇన్స్టాగ్రాం యూజర్ దేవ్ శ్రేష్ట ఈ ఘటనకు సంబంధించిన షార్ట్ వీడియోను (viral video) పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో హెల్మెట్‌లో దాగిన పాము కొద్దక్షణాల తర్వాత ఆ వ్యక్తిపైకి బుసకొడుతూ ముందుకు రావడం భయం గొలిపింది. ఈ ఘటన ఏ ప్రాంతంలో ఎప్పుడు జరిగిందన వివరాలు ఆన్లైన్లో అందుబాటులో లేవు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 40 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.
గత నెలలో ఓ పాము మహిళ షూలో కనిపించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కోబ్రా న్యూ ఫుట్‌వేర్‌ను ప్రయత్నిస్తోందని ఈ పోస్ట్‌కు సుశాంత నంద క్యాప్షన్ ఇచ్చారు.
Read More :