న్యూఢిల్లీ : లతా మంగేష్కర్ శ్రావ్యంగా ఆలపించిన మేరా దిల్ యే పుకారే సాంగ్‌కు తనదైన కిల్లర్ స్టెప్స్‌తో ఇంటర్నెట్ను ఊపేసిన పాకిస్తాన్ బాలిక ఆయేషా రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయారు. తాజాగా పలువురు మహిళలు మేరా దిల్ యే పుకారే సాంగ్‌ను పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వైరల్క్లిప్లో ఓ పెద్దావిడ ఒరిజినల్‌గా లతా మంగేష్కర్ పాడిన మేరా దిల్ యే పుకారే సాంగ్ రీమిక్స్ వెర్షన్‌ను పాడగా మోరియ ఆకాష్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో పలువురు మహిళలు మేరా దిల్ యే పుకారే సాంగ్‌ను పాడుతుండటం కనిపించింది. చలివాతావరణం కావడంతో వృద్ధురాలు వులెన్ క్లాత్స్తో పాటు షాల్స్ కప్పుకున్నారు.
ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకూ 13 లక్షలకు పైగా వ్యూస్ రాగా, పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. వృద్ధుల సింగింగ్ స్కిల్స్‌ను పలువురు యూజర్లు ప్రశంసించారు. కాగా ఈ వీడియోను హర్యానాలో చిత్రీకరించారని కొందరు పేర్కొనగా, లొకేషన్ చాందిని చౌక్ అని రీల్స్‌లో ప్రస్తావించారు.