న్యూఢిల్లీ : లతా మంగేష్కర్ ఆలపించిన మేరా దిల్ యే పుకారే ఆజా సాంగ్ రీమిక్స్‌తో ఆకట్టుకునే డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇంటర్నెట్ను షేక్ చేసిన పాకిస్తాన్ యువతి ఆయేషా ఆపై మరో సాంగ్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. లేటెస్ట్గా అక్షయ్, కరీనా సూపర్ హిట్ ట్రాక్ ఫలక్ తక్కు లిప్ సింకింగ్ ఇస్తున్న ఆయేషా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
తషన్ మూవీలోని ఈ పాటకు ఆయేషా తనదైన హావభావాలతో రీక్రియేట్ చేసిన వీడియోను డిజిటల్ కంటెంట్ క్రియేటర్ సొహిల్ చౌహాన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ 1.3 కోట్ల మంది వీక్షించారు. ఫలక్ తక్ సాంగ్ ఆలపిస్తూ ఆయేషా సల్వార్ సూట్లో కనిపించింది.
గత నెలలో ఆమె హాజరైన పెండ్లి వేడుకలోనే ఈ వీడియో రికార్డయిందని తెలుస్తోంది. తషన్ మూవీలోని ఈ సూపర్ హిట్ సాంగ్‌ను మహాలక్ష్మి అయ్యర్, ఉదిత్ నారాయణ్ హృద్యంగా ఆలపించారు.