న్యూఢిల్లీ : సర్కస్ ట్రైనర్‌పై పులి దాడి చేయడంతో అక్కడున్న వారంతా హడలిపోయిన ఘటన ఇటలీలోని మరీనా ఒర్ఫై సర్కస్‌లో వెలుగుచూసింది. లీస్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్కస్‌ల్లో జంతువులను బంధించడంపైనా ఈ ఘటన నేపధ్యంలో హాట్ డిబేట్ సాగుతోంది.
Incidente al Circo per #ivanorfei, attaccato alle spalle da una Tigre davanti ai bimbi del pubblico
Ricoverato in codice rosso#circo #Orfei pic.twitter.com/VgYDvuxkJT— SALLY (@LaSamy65280885) December 31, 2022
ట్విట్టర్లో ఈ క్లిప్‌ను షేర్ చేయగా పెద్దసంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఈ వీడియోలో సర్కస్ ట్రైనర్ ఇవాన్ ఒర్ఫై ఎత్తుగా ఉన్న ప్లాట్‌ఫాంపై ఉన్న పులికి సూచనలు చేస్తుండగా కొద్ది సెకండ్లలోనే కిందనున్న మరో పులి వెనుకనుంచి ట్రైనర్‌పై దాడికి తెగబడటం కనిపించింది. పులి తన కాళ్లతో ట్రైనర్‌ను రక్కుతూ అతడి మెడపై పంచ్ ఇవ్వడం కనిపిస్తుంది.
దీంతో ప్రేక్షకులు కేకలు వేయడంతో హెల్పర్స్ ట్రైనర్‌ను రక్షించేందుకు పంజరంలోకి దూకడం కనిపించింది. అదృష్టవశాత్తూ ఇవన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, అతడి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని సర్కస్ అధికారులు ఆ తర్వాత ప్రకటించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.