IMF Chief: సంబల్పురి సాంగ్‌పై.. స్టెప్పులేసిన ఐఎంఎఫ్ చీఫ్.. వీడియో
IMF Chief Kristalina Georgieva : ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా.. ఇండియన్ ఫోక్ బీట్స్‌కు డ్యాన్స్ చేశారు. జీ20 మీటింగ్‌కు వచ్చిన ఆమెకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వెల్కమ్ దక్కింది. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఓ డ్యాన్స్ షో చూసి ముగ్దురాలైన ఆమె ఆ జోరులోనే స్టెప్పులేశారు.
న్యూఢిల్లీ: జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా ఢిల్లీ చేరుకున్నారు. అయితే గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు స్వాగతం పలికారు. వెల్కమ్ సందర్భంగా కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. ఓ స్టేజ్‌పై సంబల్పురి సాంగ్ ప్రదర్శన జరిగింది. ఆ డ్యాన్స్ షోను వీక్షించిన క్రిస్టలీనా.. ఆ ఫోక్ బీట్స్‌కు స్టెప్పులేశారు. హుషారెక్కించే ఆ సాంగ్ జోరుకు.. అట్రాక్ట్ అయిన క్రిస్టలీనా ఆ ప్రదర్శనకారుల్ని ప్రశ్నించారు. ఇక ఆ ఊపులోనే ఆమె కొన్ని స్టెప్స్ వేశారు. ఫోక్ డ్యాన్సర్లను అనుకరిస్తూ..ఆమె కూడా కాళ్లు కదిపారు. దీనికి చెందిన వీడియోను మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ వీడియోకు లైకులు, వ్యూవ్స్ వేలల్లో వస్తున్నాయి.
Difficult to resist #Sambalpuri beats .
MD International Monetary Fund Ms. @KGeorgieva arrives in India for #G20 summit to a #Sambalpuri song and dance welcome . #OdiaPride pic.twitter.com/4tx0nmhUfK
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

