Bengal Governor | రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు.. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు
Bengal Governor | రాజ్‌భవన్ (Raj Bhavan)లో తనకు భద్రత లేదంటూ పశ్చిమబెంగాల్ గవర్నర్ (Bengal Governor) సీవీ ఆనంద్ బోస్ (CV Ananda Bose ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bengal Governor | రాజ్‌భవన్ (Raj Bhavan)లో తనకు భద్రత లేదంటూ పశ్చిమబెంగాల్ గవర్నర్ (Bengal Governor) సీవీ ఆనంద్ బోస్ (CV Ananda Bose ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంలో పూర్తిగా రాష్ట్ర పోలీసులే మోహరించి ఉన్నారని పేర్కొన్నారు. రాజ్‌భవన్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆఫీస్ ఇన్ ఛార్జి సహా పోలీసులందరినీ సీవీ ఆనంద బోస్ సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ ఆదేశించినా పోలీసు సిబ్బంది ఇప్పటికీ రాజ్ భవన్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ బోస్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
‘ప్రస్తుత ఇన్ఛార్జ్ అధికారి, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని సీఎం మమతా బెనర్జీకి చెప్పాను. అయినా ఇంతవరకూ ఎలాంటి చర్యలూ లేవు’ అని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో ఉన్న పోలీసు సిబ్బంది నిరంతరం తనను స్నూపింగ్ చేస్తున్నారంటూ గవర్నర్ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొందరు ప్రభావశీలుల ఒత్తిడితోనే వారు ఈ పని చేస్తున్నట్లు గవర్నర్ భావిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
రాజ్‌భవన్ నుంచి వెళ్లిపోండి
కాగా, రాజ్‌భవన్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని అక్కడ విధులు నిర్వరిస్తున్న ఆఫీస్ ఇన్ ఛార్జి సహా పోలీసులందరినీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్ తూర్పు ద్వారం వద్ద ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్‌ను గవర్నర్ ‘జన్ మంచ్ (ప్రజా వేదిక)’గా మార్చాలనుకొంటున్నారని రాజ్‌భవన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గవర్నర్‌ను కలవడానికి వచ్చిన బీజేపీ నేత సువేందు అధికారి, లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులుగా చెప్తున్న కొందరిని రాజ్‌భవన్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకొంది.
గవర్నర్‌ను కలవడానికి తనకు లిఖితపూర్వక అనుమతి ఉన్నా పోలీసులు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకొన్నారని సువేందు అధికారి తెలిపారు. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం మమతకూ ఈ విషయమై లేఖ రాశారు. అయితే రాజ్‌భవన్ బయట 144 సెక్షన్ అమల్లో ఉండటం వల్లే సువేందును అడ్డుకొన్నామని పోలీసులు చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గవర్నర్ బోస్ ‘హౌస్ అరెస్ట్’లో ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Also Read..
IIT Bombay | రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్.. విద్యార్థులకు రూ.1.2లక్షల ఫైన్ వేసిన ఐఐటీ బాంబే
Bihar | నితీశ్ ప్రభుత్వానికి షాకిచ్చిన పాట్నా హైకోర్టు.. బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు
Toxic Alcohol | 34కి చేరిన నాటు సారా మృతులు.. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

