IIT Bombay | రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్.. విద్యార్థులకు రూ.1.2లక్షల ఫైన్ వేసిన ఐఐటీ బాంబే
IIT Bombay | పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని కించపరుస్తూ నాటకం (Ramayana skit) వేసిన విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే (IIT Bombay) విద్యాసంస్థ భారీ జరిమానా విధించింది.
IIT Bombay | పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని కించపరుస్తూ నాటకం (Ramayana skit) వేసిన విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే (IIT Bombay) విద్యాసంస్థ భారీ జరిమానా విధించింది. ఒక్కో విద్యార్థికి ఏకంగా రూ.1.20 లక్షల చొప్పున ఫైన్ వేసింది.
ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఫెస్ట్‌లో భాగంగా కొందరు విద్యార్థులు ‘రాహోవన్ (Raahovan)’ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణానికి ఇది పేరడీ. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన పలువురు ఈ స్కిట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటకంలో భాగంగా విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. హిందువులు ఎంతో గొప్పగా భావించే రామాయణాన్ని కించపరిచారని ఆరోపించారు. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా ఈ స్కిట్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపించింది. అనంతరం స్కిట్ ప్రదర్శించిన ఎనిమిది మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 8 మందిలో నలుగురికి ఒక్కొక్కరికి రూ.1.2 లక్షల జరిమానా విధించగా మరో నలుగురికి ఒక్కొక్కరికీ రూ.40 వేల ఫైన్ వేసింది. దీంతోపాటు హాస్టల్ నుంచి డిబార్ చేసింది. మరో నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పింది. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Also Read..
Bihar | నితీశ్ ప్రభుత్వానికి షాకిచ్చిన పాట్నా హైకోర్టు.. బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు
Toxic Alcohol | 34కి చేరిన నాటు సారా మృతులు.. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్
Delhi Heatwave | అగ్నిగుండంలా ఢిల్లీ.. వడగాడ్పులకు తొమ్మిది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు మృత్యువాత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

