న్యూఢిల్లీ: భవిష్యత్తులో హైపర్‌లూప్ ట్రాక్( Hyperloop Test Track)లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్ ఏర్పాట్ల గురించి స్టడీ జరుగుతోంది. దానిలో భాగంగా భారతీయ రైల్వేశాఖ సహకారంతో ఐఐటీ మద్రాసు.. హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను రెఢీ చేసింది. ఆ ట్రాక్‌పై పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 422 మీటర్ల పొడువైన ట్రాక్‌ను డెవలప్ చేశారు. ఇలాంటి ట్రాక్‌ల ద్వారా వేగంగా డెస్టినేషన్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కేవలం 30 నిమిషాల్లో సుమారు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంటే ఢిల్లీ నుంచి జైపూర్‌కు కేవలం అరగంటలోనే ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ .. హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌కు చెందిన వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రభుత్వ, ఐఐటీ మద్రాసు సహకారంతో.. భవిష్యత్తు రవాణాపై ప్రాజెక్టులు చేపడుతున్నట్లు చెప్పారు.
హైపర్‌లూప్ ప్రాజెక్టుకు రైల్వేశాఖ నిధుల్ని మంజూరీ చేసింది. ఐఐటీ మద్రాసు క్యాంపస్‌లో దీన్ని నిర్మించారు. అక్కడ వచ్చిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలుత వేసిన 422 మీటర్ల ట్రాక్ ద్వారా టెక్నాలజీ డెవలప్ చేస్తామని, రెండుసార్లు పది లక్షల డాలర్లు ఇచ్చామని, ఆ తర్వాత మూడవ దశలో మరో పది లక్షల డాలర్లు ఇవ్వనున్నామని, హైపర్‌లూప్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఆ నిధుల్ని ఐఐటీ మద్రాసు ఖర్చు చేస్తుందని మంత్రి చెప్పారు.
హైపర్‌లూప్‌కు చెందిన తొలి కమర్షియల్ ప్రాజెక్టు ప్లాన్‌ను త్వరలో రైల్వేశాఖ అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాక్యూమ్ ట్యూబుల్లో ప్రత్యేకమైన క్యాప్సూల్స్ ద్వారా హై స్పీడ్ లో హైపర్‌లూప్ ప్రయాణం సాగించవచ్చు. దీన్ని ఫిఫ్త్ మోడ్ ట్రాన్స్‌పోర్టుగా పిలుస్తున్నారు. ధ్వని వేగంతో పోలిస్తే మాక్ 1.0 స్పీడ్‌తో హైపర్‌లూప్ ప్రయాణం ఉంటుందని ప్రెస్ రిలీజ్ లో తెలిపారు. వన్ మాక్ అంటే గంటకు 761 కిలోమీటర్ల దూరం అని అర్థం. వెదర్‌కు తగ్గ రీతిలో హైపర్‌లూప్ ప్రయాణం ఉంటుంది. ఎటువంటి కొలిజన్ ఉండదు. విమాన వేగం కన్నా రెండు రెట్లు వేగంగా వెళ్తుంది.
The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025