ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్
ఐఐటీ మద్రాస్ మరో ఘనత సాధించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్-2022 ఏడవ ఎడిషన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ర్యాంకులు విడుదల చేశారు
- ఎన్ఐఆర్ఎఫ్-2022 ర్యాంకింగ్స్ విడుదల
- యూనివర్సిటీల క్యాటగిరీలో టాప్-3లో ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా
న్యూఢిల్లీ, జూలై 15: ఐఐటీ మద్రాస్ మరో ఘనత సాధించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్-2022 ఏడవ ఎడిషన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ర్యాంకులు విడుదల చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు, ఐఐటీ-బాంబే రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక యూనివర్సిటీల క్యాటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు మొదటి స్థానం సంపాదించుకోగా, ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
పలు క్యాటగిరీల్లో ఇలా..
ఇక కాలేజీల క్యాటగిరీలో ఢిల్లీలోని మిరండా హౌస్ కాలేజీ, ఇంజినీరింగ్‌లో ఐఐటీ-మద్రాస్, మేనేజ్మెంట్ క్యాటగిరీలో ఐఐఎం-అహ్మదాబాద్, మెడికల్ క్యాటగిరీలో ఢిల్లీ ఎయిమ్స్, లా విద్యాసంస్థల క్యాటగిరీలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అగ్రస్థానాలు పొందాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన జేఎన్‌యూ, జామియా మిలియా వర్సిటీల్లోని విద్యార్థులను దేశ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించేందుకు మోదీ సర్కార్, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఇప్పుడు అదే కేంద్రం ఆయా విద్యాసంస్థలను యూనివర్సిటీల క్యాటగిరీలో టాప్-3 జాబితాలో ప్రకటించడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- IIT Madras
- NIRF
- Rankings
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

