న్యూఢిల్లీ, మార్చి 23 : అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా కోసం అధునాతన ఏఐ ఆధారిత రోబోలను ఐఐటీ గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇవి సవాలుతో కూడిన భూభాగాలపై ఏఐ-ఆధారిత నిఘా, నిరంతర పర్యవేక్షణను అందిస్తాయని అధికారులు తెలిపారు. గువాహటి ఐఐటీ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ కంపెనీ ‘డీఎస్ఆర్ఎల్’ ఈ రోబోలను తయారుచేసిందని చెప్పారు. ఈ రోబోలతో నిఘాకు సంబంధించి ఆర్మీ ఇప్పటికే క్షేత్రస్థాయి ట్రయల్స్ నిర్వహించినట్టు ఐఐటీ అధికారులు తెలిపారు. మానవ గస్తీతో ఎదురయ్యే సవాళ్లను వీటితో అధిగమించవచ్చని పేర్కొన్నారు.