ముంబయి: ప్లేస్మెంట్ డ్రైవ్లో ఐఐటీ-బాంబే విద్యార్థులు గత రికార్డులను తిరగరాశారు. ఓ విద్యార్థికి రూ.3.7 కోట్ల వార్షిక వేతనాన్ని ఓ అంతర్జాతీయ సంస్థ ఆఫర్ చేసిందని, దేశీయ సంస్థల నుంచి అత్యధికంగా రూ.1.7కోట్ల ఆఫర్ వచ్చిందని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఐఐటీ-బాంబే తెలిపింది. వార్షిక వేతనం రూ.కోటి దాటిన ఆఫర్లు మొత్తం 16మంది విద్యార్థులకు వచ్చాయని తెలిపింది. ప్లేస్మెంట్ డ్రైవ్లో 300 మంది పాల్గొన్నారని, దీంట్లో 194మంది విద్యార్థులు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లను అంగీకరించినట్టు వివరించింది. 65 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్స్ వచ్చాయని తెలిపింది.