ముంబయి: ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి.. ఆ సంస్థ కోసం భూరి విరాళం అందజేశాడు. ఏకంగా రూ.153 కోట్లు (18.6 మిలియన్ డాలర్లు) విరాళం ఇచ్చాడు. తన పేరు, వివరాలు సదరు విద్యార్థి పేర్కొనలేదు. ఈ విషయాన్ని ఐఐటీ బాంబే అధికారులు గురువారం వెల్లడించారు.
పర్యావరణ సంక్షోభం, భూతాపాన్ని పరిష్కరించటంలో ఐఐటీ బాంబే పాత్ర ఉండాలని కోరుతూ విరాళం అందజేసినట్టు సంస్థ పేర్కొన్నది. పూర్వ విద్యార్థి రూ.153 కోట్లు అందజేసినట్టు ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరీ తెలిపారు.