చండీగఢ్: తమ సమస్యను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు వినూత్నంగా ప్రయత్నించారు. మెస్‌లో నిద్రిస్తూ నిరసన తెలిపారు. (Sleep Protest) హాస్టల్లో ఏసీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాదిలో ఎండలు మండిపోతున్నాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఐఎం అమృత్సర్ విద్యార్థులు వేడిని భరించలేకపోతున్నారు. హాస్టల్ రూమ్స్‌లో ఏసీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీని కోసం శుక్రవారం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ఏసీలు ఉన్న మెస్, క్యాంటీన్లో విద్యార్థులు నిద్రిస్తూ నిరసన తెలిపారు.
కాగా, ఐఐఎం అమృత్సర్ విద్యార్థుల వినూత్న నిద్ర నిరసనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఆధునిక సమస్యకు ఆధునిక పరిష్కారం అవసరం’ అన్న క్యాప్షన్‌తో దీనిని షేర్ చేశారు. ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అత్యున్నత విద్యా సంస్థలో విద్యార్థులకు ఏసీలు లేకపోవడం సిగ్గుచేటు అని ఒకరు విమర్శించారు. విద్యార్థుల సమస్యను మేనేజ్మెంట్ పరిష్కరించాలని, హాస్టల్ రూమ్స్‌లో ఏసీలు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
IIM Amritsar students protested against the management to get AC installed in their hostel by sleeping in the library that has AC. One of them said, "Modern problem requires modern solution” 😂 pic.twitter.com/d8D6rl9G9Q
— Shubh (@kadaipaneeeer) June 14, 2024