Mamata Banerjee | లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేయండి.. దీదీకి బీజేపీ సవాల్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ (PM Modi)పై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు (BJP Leader) అగ్నిమిత్ర పాల్ (Agnimitra Paul) సవాల్ విసిరారు.
Mamata Banerjee | సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో దేశంలోని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు (BJP Leader) గట్టి ఛాలెంజ్ విసిరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ (PM Modi)పై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్ (Agnimitra Paul).. దీదీకి సవాల్ విసిరారు.
ఇండియా కూటమి నాలుగో సమావేశం సందర్భంగా.. వారణాసిలో మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీ చేయాలని మమతా బెనర్జీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అగ్నిమిత్ర పాల్.. దీదీకి ఛాలెంజ్ విసిరారు. ‘మమతా బెనర్జీ వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయరు? కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కాకుండా వారణాసి నుంచి లోక్‌సభ స్థానానికి (Varanasi Lok Sabha seat) ప్రధాని మోదీపై పోటీ చేసే దమ్ము మమతాకు ఉంటే ఆ పని చేయాలి. మీరు (దీదీని ఉద్దేశిస్తూ) ప్రధాని కావాలనుకుంటున్నారు కదా? అప్పుడు మన ప్రధానిపై పోటీ చేయండి’ అని అగ్నిమిత్ర పాల్ వ్యాఖ్యానించారు.
#WATCH कोलकाता: पश्चिम बंगाल से भाजपा विधायक अग्निमित्रा पॉल ने कहा, “…सीट शेयरिंग से पहले ममता बनर्जी में अगर हिम्मत हो तो वाराणसी से प्रधानमंत्री मोदी के खिलाफ वे चुनावी मैदान में उतरें…अधीर रंजन चौधरी को अपने प्रदेश कांग्रेस के ऑफिस को ताला लगा देना चाहिए और TMC के ऑफिस… pic.twitter.com/1TOqu6iqtS
— ANI_HindiNews (@AHindinews) December 22, 2023
Also Read..
Human Trafficking | భారతీయులతో వెళ్తున్న విమానం ఫ్రాన్స్‌లో నిలిపివేత.. స్పందించిన భారత్
P Chidambaram | 2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా చిదంబరం
Dense Fog | ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. ఆధ్వాన్నంగా గాలి నాణ్యత.. ఆలస్యంగా నడుస్తున్న పలు విమానాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

