న్యూఢిల్లీ : గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) గట్టి పట్టు సాధించాయి. హమాస్ నడుపుతున్న పార్లమెంటు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నామని ఐడీఎఫ్ మంగళవారం ప్రకటించింది. ఉగ్రవాదులు అక్టోబరు 7న ఇక్కడి నుంచే ఇజ్రాయెల్‌పై దాడి చేశారని తెలిపింది.
హమాస్ ఉగ్రవాదులతో భీకర పోరు జరుగుతున్నదని, సాధారణ పౌరులు దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోయేందుకు వీలుగా మానవతావాద కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ఓ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ భవనాన్ని స్వాధీనం చేసుకున్నామని, దీనిలో ఆయుధాలను తయారు చేస్తున్నారని వెల్లడించింది.