ICMR | న్యూఢిల్లీ, మే 12: ప్యాకేజ్డ్ పదార్థాలపై ఉండే ఫుడ్ లేబుళ్లు తప్పు దోవ పట్టించే అవకాశం ఉన్నదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వినియోగదారులను హెచ్చరించింది. వాటిపై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదివి ఆరోగ్యకరమైన వాటిని ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఇటీవల అనేక సమీక్షల అనంతరం జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్)తో కలిసి ఐసీఎంఆర్ భారతీయుల ఆహారంపై కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
ఫ్రూట్ జ్యాస్లలో కేవలం 10 శాతం మాత్రమే పండ్ల గుజ్జు ఉండొచ్చని తెలిపింది. ‘కఠిన ప్రమాణాలు అమల్లో ఉన్నా లేబుళ్లపై ఉన్న సమాచారం తప్పు దోవ పట్టించవచ్చు’ అని ఐసీఎంఆర్ తెలిపింది. ‘నేచురల్’ ఫుడ్ ప్రొడక్ట్ అంటే ఎలాంటి రంగులు, ఫ్లేవర్స్ కలపకుండా, తక్కువ ప్రాసెసింగ్ చేసిన ఆహారం. కానీ తయారీదారులు రెండు, మూడు సహజసిద్ధమైన పదార్థాలను వాడినా తమది నేచురల్ ఫుడ్ అని లేబుల్‌పై ముద్రిస్తున్నారని ఉదాహరించింది.