సోమవారం 26 అక్టోబర్ 2020
National - Aug 30, 2020 , 16:39:14

వరదలో చిక్కుకున్న వృద్ధుడిని రక్షించిన ఐఏఎఫ్‌ సిబ్బంది.. వీడియో

వరదలో చిక్కుకున్న వృద్ధుడిని రక్షించిన ఐఏఎఫ్‌ సిబ్బంది.. వీడియో

భోపాల్‌ : గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లోని 12 జిల్లాల్లోని వందలాది గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటివరకు సుమారు ఎనిమిది మంది మరణించగా.. 9,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

నదులు పొంగి పొర్లుతుండడంతో వరద ఇండ్ల మధ్యకు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సహాయక చర్యలు ప్రారంభించిన భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న గ్రామస్తులను కాపాడుతున్నారు. వైంగంగా నది ఒడ్డున ఉన్న బాలాఘాట్‌లోని మోవాడ్ గ్రామానికి సమీపంలో ఓ ఇంటి మీద ఉన్న వృద్ధుడితో సహా ముగ్గురు వ్యక్తులను ఎంఐ17వీ5 హెలికాఫ్టర్‌ ద్వారా  రక్షిస్తున్న వీడియోను ఐఏఎఫ్‌ సిబ్బంది ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 

ఇంటిని వరద నీరు చుట్టుముట్టడంతో సహయం కోసం ఎదురుచూస్తున్న వృద్ధుడి కోసం హెలికాఫ్టర్‌ నుంచి ఐఏఎఫ్‌ సిబ్బంది ఒకరు దూకారు. తరువాత వృద్ధుడిని గట్టిగా పట్టుకొని రోప్‌ సాయంతో పైకి లాగారు. మహిళలు, పిల్లలతో సహా మొత్తం 20 నుంచి 25 మందిని ఆదివారం ఐఏఎఫ్‌ సిబ్బంది రక్షించారు. 

ఇదిలా ఉండగా అంతకు ముందు రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్రంలోని వరద పరిస్థితుల గురించి మాట్లాడారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo