కోల్‌కతా: రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన బీజేపీ సీనియర్ నేత (Dilip Ghosh) పట్ల స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. గొంతు నొక్కుతానంటూ మహిళలను ఆయన బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మెదినీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 21న ఖరగ్‌పూర్‌లోని ఆరో నంబర్ వార్డులో కొత్తగా నిర్మించిన రోడ్డును ప్రారంభించేందుకు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ వెళ్లారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు ఆయనను చుట్టుముట్టారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడా కనిపించలేదంటూ నిరసన తెలిపారు. తమ కౌన్సిలర్ ప్రదీప్ సర్కార్ ఈ రోడ్డును నిర్మించారని అన్నారు. ప్రారంభోత్సవం కోసం ఆయన రావడంపై మహిళలు మండిపడ్డారు.
కాగా, బీజేపీ నేత దిలీప్ ఘోష్ తీవ్రంగా స్పందించారు. మహిళా నిరసనకారులను తృణమూల్ మద్దతుదారులుగా ముద్రించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీలాడ్ నిధులతో ఈ రోడ్డును నిర్మించినట్లు చెప్పారు. ‘మీ నాన్న డబ్బులతో కాదు. వెళ్లి ప్రదీప్ సర్కార్‌ని అడగండి’ అని అన్నారు.
మరోవైపు కొందరు మహిళలు ఆగ్రహించారు. తమ తండ్రి గురించి ఎందుకు ప్రస్తావించావని దిలీప్ ఘోష్‌ను నిలదీశారు. ప్రజాప్రతినిధివైన నువ్వు ఇలా మాట్లాడవచ్చా? అని ప్రశ్నించారు. దీంతో దిలీప్ ఘోష్ సహనం కోల్పోయారు. ‘మీ పద్నాలుగు తరాల గురించి కూడా మాట్లాడతా. అరవకండి. మీ గొంతు నొక్కుతా’ అని బెదిరించారు. ఆ మహిళలను ‘తృణమూల్ కుక్కలు’గా ఆయన అభివర్ణించారు.
అయితే బీజేపీ నేత దీలిప్ ఘోష్ వ్యాఖ్యలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఆగ్రహించిన మహిళలు ఆయన కారును చుట్టుముట్టారు. ఆ వాహనంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ছিঃ! একজন মহিলাকে বিজেপি নেতা দিলীপ ঘোষ কিভাবে হুমকি দিচ্ছে, শুনে নিন! বিজেপির থেকে এর বেশি আর কিই বা আশা করা যায়? ধিক্কার বিজেপিকে!#ShameOnBJP #DilipGhosh #bjpwestbangal pic.twitter.com/JdGL4guhJc
— Banglar Gorbo Mamata (@BanglarGorboMB) March 21, 2025