Sayantika Banerjee | నా మీద నమ్మకంతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు : టీఎంసీ ఎమ్మెల్యే
Sayantika Banerjee | ‘నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు’ అని ప్రముఖ బెంగాలీ నటి (Bengali actress), తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే సయాంతిక బెనర్జి (Sayantika Banerjee) నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సయాంతిక మీడియాతో మాట్లాడారు.
Sayantika Banerjee : ‘నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు’ అని ప్రముఖ బెంగాలీ నటి (Bengali actress), తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే సయాంతిక బెనర్జి (Sayantika Banerjee) నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సయాంతిక మీడియాతో మాట్లాడారు.
‘నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు. నాతో ప్రమాణస్వీకారం చేయించడంలో చొరవ తీసుకున్న స్పీకర్‌కు కృతజ్ఞతలు’ అని ఆమె పేర్కొన్నారు. బెంగాల్లో పలు సినిమాల్లో నటించి పేరు సంపాదించుకున్న సయాంతిక బెనర్జి 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. 2024లో టీఎంసీ సీనియర్ నేత తపస్ రాయ్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో బారానగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. దాంతో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా సయాంతిక టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

