ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 07:21:45

చైనీయుల మనీలాండరింగ్‌.. ఐటీ సోదాలు

చైనీయుల మనీలాండరింగ్‌.. ఐటీ సోదాలు

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న చైనీయులు, స్థానికంగా ఉన్న వారి అనుయాయులకు సంబంధించి ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహించింది. డొల్ల కంపెనీల ద్వారా రూ.1000 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై ఈ సోదాలు జరిపినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఆయా కంపెనీల‌పేరుతో వివిధ బ్యాంకుల్లో 40కి పైగా అకౌంట్లు తెరిచిన‌ట్లు తేలింద‌న్నారు  

భారత్‌లో రిటైల్‌ షోరూమ్‌ల బిజినెస్‌ను ప్రారంభించేందుకు ఒక చైనా కంపెనీ అనుబంధ సంస్థ, దాని సంబంధీకులు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్టు తేలిందని పేర్కొంది. కొందరు చైనీయులు, వారి భారతీయ అనుచరులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు విశ్వసనీయమైన సమాచారం ఉందని తెలిపింది.


logo