Imran : కాల్పులకు విరమణకు అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే మాట తప్పిన పాకిస్థాన్ (Pakistan) సైన్యం భారత్‌పై దాడి చేసింది. శనివారం రాత్రి పూంచ్ జిల్లా (Poonch district) లోని ఆర్ఎస్ పుర సెక్టార్ (RS Pura sector) లో భారత సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు, ఒక ఎయిర్‌ఫోర్స్ జవాన్‌తోపాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సబ్ఇన్స్పెక్టర్ (SI) మహ్మద్ ఇంతియాజ్ (Mohammed Imteyaz) ప్రాణాలు కోల్పోయారు.
మహ్మద్ ఇంతియాజ్ కుమారుడు ఇమ్రాన్ తన తండ్రి మరణంపై భావోద్వేగంతో స్పందించారు. తన తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఎంతో గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఇదిలావుంటే బీహార్‌కు చెందిన పులువురు రాజకీయ నాయకులు ఇంతియాజ్‌కు నివాళులర్పించారు. ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు.
#WATCH | Patna, Bihar: BSF Sub-Inspector Mohammed Imteyaz lost his life in the line of duty due to cross-border shelling from Pakistan in Jammu and Kashmir’s RS Pura sector on May 10
His son Imran says, “I am proud of my father. I salute all those who have sacrificed their lives… pic.twitter.com/p6hM63vwFG
— ANI (@ANI) May 12, 2025