చిక్కమగళూరు (కర్ణాటక), జూన్ 11: కర్ణాటకలోని హెబ్బే జలపాతానికి విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్ యువకుడు ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ (25) స్నేహితుడితో కలిసి కర్ణాటకకు విహారయాత్రకు వెళ్లాడు.
సోమవారం బైక్‌ను రెంట్‌కు తీసుకొని కెమ్మనగుండి సమీపంలోని హెబ్బే జలపాతం వద్దకు వెళ్లారు.ఇద్దరికీ ఈత రానప్పటికీ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ కాలుజారి నీటిలో పడిపోయారు. నీటిలో మునిగేంత లోతు లేనప్పటికీ కాలుజారినప్పుడు శ్రవణ్ తల బండరాయికి తగిలింది. తీవ్రంగా గాయపడిన శ్రవణ్‌ను సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.