ముంబై, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : వివాహిత స్త్రీలు వట సావిత్రి పౌర్ణమి నాడు మర్రిచెట్టును పూజించి, తమకు ఏడు జన్మల పాటు ఒకే భర్త లభించాలని ప్రార్థిస్తారు. అయితే, ప్రస్తుతం చాలా మంది పురుషులు వివాహం తర్వాత తమ భార్యల నుంచి మానసిక వేధింపులు ఎదురొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని భార్య బాధితుల ఆశ్రమంలోని వట సావిత్రి పూర్ణిమ పండుగ ముందు నాడు భార్యల బాధితులు రావి చెట్టు ముందు బారులు తీరి, ‘తండ్రీ.. మాకు ఇలాంటి భార్యలు వద్దు’ అని ప్రార్థనలు చేశారు. గత ఏడేండ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారంలో భాగంగా ఈ ఏడాది కూడా వట సావిత్రి పౌర్ణమి సందర్భంగా శనివారం భార్యల చేతిలో హింసకు గురైన భర్తలందరూ సమావేశమయ్యారు. ఇకడ రావి చెట్టును పూజించారు.