న్యూఢిల్లీ: మానవుల మనుగడకు అన్ని వైపుల నుంచి ముప్పు ఎదురవుతున్నది. వాతావరణ మార్పులు, ఏఐ వంటివి మానవుల ఉనికికి హాని కలిగించబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది? అనే ప్రశ్నపై కొందరు శాస్త్రవేత్తలు పరిశీలన జరిపారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ టిమ్ కౌల్సన్ తెలిపిన వివరాల ప్రకారం, ఆక్టోపస్ ఈ భూమిపై ఆధిపత్యం సాధించగలదు. ఆక్టోపస్‌లు పరస్పరం భావ వ్యక్తీకరణ చేసుకోగలవు.
ఇవి చాలా తెలివైనవి. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మలచుకోగలవు. దేనినైనా ఉపయోగించుకోగలిగే సామర్థ్యం కలవి. వాస్తవ, వర్చువల్ వస్తువుల మధ్య తేడాను గుర్తించగలవు. తమ చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తించగలవు. లోతైన సముద్రాల్లోనూ, తీర ప్రాంతాల్లోనూ జీవించగలవు. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడంలో వీటిని ఈ లక్షణాలు ముందు వరుసలో నిలుపుతాయి అని కౌల్సన్ వివరించారు.