Brij Bhushan Singh | న్యూఢిల్లీ, ఆగస్టు 9: లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను తాకడం, కౌగలించుకోవడం నేరం కాదని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ బుధవారం కోర్టుకు తెలిపాడు. తనపై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల్ని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు.
ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ముందు బ్రిజ్‌భూషణ్ న్యాయవాది వాదనలు వినిపించారు. ‘రెజ్లింగ్‌లో కోచ్‌లుగా ఎక్కువగా పురుషులే ఉంటారు. తాను కోచింగ్ ఇచ్చిన క్రీడాకారిణి మెడల్ సాధిస్తే.. సంతోషంతో కోచ్ ఆలింగనం చేసుకుంటాడు. ఇది నేరం కిందకు రాదు’ అని ఆయన కోర్టుకు తెలిపాడు.