Dengue | న్యూఢిల్లీ : దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నిరోధానికి శాస్త్రవేత్తలు వినూత్న విధానాన్ని కనుగొన్నారు. మగ దోమలకు చెముడు తెప్పిస్తే, డెంగ్యూ, యెల్లో ఫీవర్, జికాల వ్యాప్తిని నిరోధించవచ్చునని చెప్తున్నారు. ఆడ, మగ దోమలు ఎగిరేటపుడు తమ రెక్కలతో చప్పుడు చేస్తాయి.
రెక్కల చప్పుడుకు మగ దోమలు ఆకర్షితులై, ఎగిరేటపుడే ఆడ దోమలతో జత కలుస్తాయి. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మగ దోమల వినికిడి శక్తిని పోగొట్టే విధంగా జెనెటిక్ పాత్వేను మార్చారు. మూడు రోజులపాటు ఈ మగ దోమలను ఆడ దోమలతో కలిపి ఒకే చోట ఉంచినప్పటికీ, అవి జత కలవలేదని గుర్తించారు. ఆడ దోమలు వ్యాధులను వ్యాప్తి చేస్తాయని, వీటికి పిల్లలు పుట్టకుండా చేయడం వల్ల వ్యాధుల వ్యాప్తిని నిరోధించవచ్చునని గుర్తించారు.