డెల్టా ప్లస్ వేరియంట్.. ఇది ఎంత డేంజర్? అడ్డుకోవడానికి ఏం చేయాలి?

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అది ఓ కొత్త మ్యుటేషన్‌తో సవాలు విసురుతూనే ఉంది. తొలిసారిగా మన దేశంలోనే కనిపించిన డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్‌కు కారణమై ఎంత విధ్వంసం సృష్టించిందో మనం చూశాం. ఇప్పుడు అదే డెల్టాలో నుంచి పుట్టుకొచ్చిన మరో వేరియంట్ డెల్టా ప్లస్ భయపెడుతోంది. ఇదే ఇండియాలో థర్డ్ వేవ్‌కు కారణమవుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇండియా దీనిని ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించింది. మరి ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరం? దీనిని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
అసలేంటీ డెల్టా-ప్లస్ వేరియంట్?
ఈ డెల్టా ప్లస్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించింది. ఇప్పుడు ఇండియాలో కనీసం 10 రాష్ట్రాలు, ప్రపంచంలో పది దేశాలకు విస్తరించిన డెల్టా ప్లస్ (ఏవై.1) వేరియంట్ తొలిసారి మార్చిలో యూరప్‌లో కనిపించింది. ఆ యూకేలో గుర్తించిన తొలి ఐదు కేసులకు సంబంధించిన వ్యక్తులు నేపాల్, టర్కీ నుంచి వచ్చి ఉంటారని ఆ దేశం వెల్లడించింది.
డెల్టానే కరోనా వైరస్‌లోని భిన్న జాతిగా గుర్తించారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ కొన్ని మ్యుటేషన్ల వల్ల భిన్నంగా ప్రవర్తించింది. ఇక డెల్టా ప్లస్ అనే మరో వేరియంట్ తన పేరెంట్ అయిన డెల్టా కంటే కూడా భిన్నంగా ఉంది. దీనికి కారణమైన ముఖ్యమైన మ్యుటేషన్‌ను కే417ఎన్గా పిలుస్తున్నారు. ఈ మ్యుటేషన్ మానవ కణాలను మరింత గట్టిగా పట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
దీనిని ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించడానికి భారత అధికారులు రెండు ముఖ్యమైన కారణాలను చెబుతున్నారు. ఇది చాలా వేగంగా వ్యాపించడం అందులో ఒకటి కాగా.. మరొకటి మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు ఇది లొంగడం లేదు. స్వల్ప నుంచి మోస్తరు లక్షణాలతో ముప్పు ఎక్కువ ఉన్న పేషెంట్లకు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స అందిస్తున్నారు.
వ్యాక్సిన్లు పని చేస్తాయా?
ఇప్పుడిదే పెద్ద సమాధానం లేని ప్రశ్నగా ఉంది. నిజానికి కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినప్పుడల్లా దానిపై వ్యాక్సిన్లు సమర్థంగా పని చేస్తాయా అన్న సందేహాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. గతంలోని వేరియంట్ల ఆధారంగా వ్యాక్సిన్లు తయారు చేయడం వల్ల అవి కొత్తవాటిపై ఎలా పని చేస్తాయో అన్న సందేహం ఉంటుంది. అలాగని అవి అసలు పని చేయవనీ చెప్పలేమని నిపుణులు అంటున్నారు.
నిజానికి ఇండియాలో ప్రధానంగా ఇస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌పై సమర్థంగా పని చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. మరోవైపు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) దీనిపై పరిశోధన చేయనున్నట్లు ప్రకటించాయి.
అడ్డుకోవాలంటే ఏం చేయాలి?
డెల్టా ప్లస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించినా.. ఇప్పటి వరకూ దీనికి సంబంధించి ఎలా సూచనలూ చేయలేదు. డెల్టా వేరియంట్లో భాగంగానే ఈ డెల్టా ప్లస్‌ను కూడా తాము ట్రాక్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌పై అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్య పెంచడం, కాంటాక్ట్‌లను వేగంగా గుర్తించడం, వ్యాక్సినేషన్ వేగం పెంచడంపై దృష్టి సారించాలని నిర్ణయించింది.
డెల్టాలాంటి కొత్త వేరియంట్లు కనిపించినప్పుడు బ్రిటన్‌లాంటి దేశాలు వ్యాక్సినేషన్ వేగం పెంచి వ్యాప్తిని కట్టడి చేశాయి. డెల్టా ప్లస్ వేరియంట్ విషయంలోనూ గత వేరియంట్లలాగే అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించడం తప్పనిసరి.
ఇవి కూడా చదవండి..
మన న్యాయమూర్తి జపాన్ ప్రజలకు ఎలా దేవుడయ్యారు? ఇంతకీ ఎవరాయన?
గర్భాశయం లేకుండా బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
అక్కడ కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే కోడి ఫ్రీ.. ఇంకా ఎక్కడెక్కడ ఏ ఆఫర్లు ఉన్నాయంటే..
పొట్టి భర్త పొడగరి భార్య: వరల్డ్ రికార్డును చెరిపేశారు
ఒకే కాన్పులో పది మంది సంతానం : మహిళ కట్టుకథ రట్టు
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

