Arvind Kejriwal | రాత్రంతా లాకప్‌లోనే కేజ్రీవాల్.. 10 రోజులు కస్టడీ కోరే అవకాశం
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను రాత్రంతా ఈడీ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లాకప్‌లో ఉంచినట్లు (ED lockup) తెలిసింది.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi excise policy Case)లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం రామ్ మనోహర్ లోహియా వైద్యుల బృందం కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం దేశ రాజధానిలోని ఈడీ కార్యాలయానికి ఆయన్ని తరలించారు. అయితే కేజ్రీవాల్‌ను రాత్రంతా ఈడీ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లాకప్‌లో ఉంచినట్లు (ED lockup) తెలిసింది.
అయితే రాత్రి కేజ్రీవాల్‌ను అధికారులు ఎలాంటి ప్రశ్నలూ వేయలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాత్రంతా కేజ్రీ సరిగా నిద్రపోలేదని, తెల్లవారుజామునే నిద్రలేచి అల్పాహారం, మందులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరికాసేపట్లో కేజ్రీని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, విచారణ కోసం 10 రోజులపాటు కస్టడీ కోరనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నేడు అత్యవసర విచారణ చేపట్టే అవకాశం ఉంది.
Also Read..
Bhagwant Mann | మీరు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయగలరు.. ఆయన ఆలోచనను కాదు: పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Arvind Kejriwal | పదవిలో ఉండి అరెస్టయిన మొదటి సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal | జైల్లో ఉన్నా కేజ్రీనే ఢిల్లీ ముఖ్యమంత్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

