Arvind Kejriwal | పదవిలో ఉండి అరెస్టయిన మొదటి సీఎం కేజ్రీవాల్
సీఎం పదవిలో ఉంటూ అరస్టైన మొదటి వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నిలిచారు. గతంలో బీహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూప్రసాద్పై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రిదేవికి బా ధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్: సీఎం పదవిలో ఉంటూ అరస్టయిన మొదటి వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నిలిచారు. గతంలో బీహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూప్రసాద్పై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రిదేవికి బా ధ్యతలు అప్పగించారు. ఇటీవల అరస్టయిన హేమంత్ సోరెన్ కూడా అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడే జయలలితకు శిక్ష పడింది. దీంతో ఆమె సీఎం పదవిని కోల్పోయారు. చట్టప్రకారం శిక్ష పడ్డాక పదవిని కోల్పోతారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ చేస్తున్న ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. దీంతో ఆయనకు శిక్ష పడలేదు. కాబట్టి, సీఎంగా కొనసాగేందుకు చట్టప్రకారం అడ్డంకులుండవని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం సాయంత్రం సుదీర్ఘంగా విచారించిన తర్వాత కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అసలు ముఖ్యమంత్రిని అరెస్టు చేయవచ్చా ?
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు. కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఈ రక్షణ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే అనేది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుంది. కాబట్టి, ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి చట్టపరంగా అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

