Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఈడీ అరెస్టు చేయడంతో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా ? కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు ? వంటి ప్రశ్నలు మొదలయ్యాయి. దీనికి ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రస్తుతం కీలక నాయకురాలిగా ఉన్న ఆతిశీ (Atishi) స్పష్టత ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కొనసాగుతారని, ఇందులో రెండో ఆలోచనే లేదని ఆమె ప్రకటించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే.. జైలు నుంచే ఆయన పని చేస్తారని ముందు నుంచే తాము స్పష్టంగా చెప్తున్నామని ఆమె పేర్కొన్నారు.
కేజ్రీవాల్‌పై నేరం రుజువు కాలేదని, జైలు నుంచి పని చేయకుండా అడ్డుకునే చట్టమేదీ లేదని ఆమె చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయెల్, ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా కూడా.. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తారని స్పష్టం చేశారు.