Railway Employees | సూరత్: ప్రమోషన్ల కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టారు గుజరాత్‌కు చెందిన ముగ్గురు రైల్వే ఉద్యోగులు. సూరత్ సమీపంలో కిమ్ – కొసంబ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై 71 లాక్‌లు, ట్రాక్‌లను కలిపే రెండు ఫిష్‌ప్లేట్లు తీసేసి ఉన్నాయని, వాటిని పక్క ట్రాక్‌పై పెట్టారని సుభాష్ పొదార్ అనే ట్రాక్‌మెన్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ కుట్రపై నిగ్గు తేల్చేందుకు పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. సుభాష్‌ను అనుమానించి విచారించగా ఈ కుట్ర చేసింది సుభాష్‌తో పాటు మరో ట్రాక్‌మెన్ మనీశ్ కుమార్, కాంట్రాక్ట్ కార్మికుడు శుభం అని తేలింది. రైలు ప్రమాదాన్ని ఆపామని చెప్తే పదోన్నతులు, రివార్డులు, పబ్లిసిటీ వస్తుందనే ఇలా చేశామని నిందితులు తెలిపారు.
న్యూఢిల్లీ: ఉన్నావో లైంగికదాడి బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు కల్పించిన సీఆర్పీఎఫ్ భద్రతను ఉపసంహరించాలని నిర్ణయించినట్టు పేర్కొంటూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు బెదిరింపులు రావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వారికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. అయితే, ప్రస్తుతం వారికి ఎటువంటి బెదిరింపులు రావడం లేదని, కాబట్టి వారికి కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు కేంద్రం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. వారి వాదనలు విన్న జస్టిస్ బీఏ త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మతో కూడిన ధర్మాసనం.. దీనిపై స్పందించాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులను కోరింది.