Hooch Tragedy | బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కల్తీ సారా ఘటనలు : నిర్మలా సీతారామన్ విమర్శలపై కాంగ్రెస్
Hooch Tragedy : తమిళనాడులోని కళ్లకురిచిలో నాటుసారా ఘటనలో 56 మంది మరణించిన ఘటనపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పాలక డీఎంకే, కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు.
Hooch Tragedy : తమిళనాడులోని కళ్లకురిచిలో నాటుసారా ఘటనలో 56 మంది మరణించిన ఘటనపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పాలక డీఎంకే, కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. కల్తీ సారా తాగి దళితులు మరణిస్తుంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నోరు మెదపడం లేదని ఆమె చేసిన విమర్శలను కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ తోసిపుచ్చారు.
కల్తీ సారా ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయని, ఆ సమయంలో ఆమె కళ్లు మూసుకుందని దుయ్యబట్టారు. ఆమె రాజకీయ విమర్శలకు కల్తీ సారా ఘటనను వేదికగా చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ మద్యం మృతులు చోటు చేసుకున్నాయని, ఆయా రాష్ట్రాల్లో తమిళనాడు కంటే అధికంగా మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.
అప్పట్లో పెదవివిప్పని కేంద్ర మంత్రి కళ్లకురిచి ఘటనపై మాత్రం కాంగ్రెస్ పార్టీపై, తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కాగా కల్తీ మద్యం ఘటనపై తాను విస్మయానికి గురయ్యానని పేర్కొన్న నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో కల్తీ సారా ఏరులై పారుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని డీఎంకే ప్రభుత్వాన్ని నిలదీశారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

