గురువారం 21 జనవరి 2021
National - Dec 20, 2020 , 10:51:24

హోండా ప్లాంట్ మూసివేత...?

హోండా ప్లాంట్ మూసివేత...?

లక్నో:హోండా కార్స్ ఇండియా లిమిటెడ్( హెచ్సీఐఎల్)ఉత్తర ప్రదేశ్‌లోని తన గ్రేటర్ నోయిడా ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు సమాచారం. జపానీస్ ఆటో దిగ్గజం హోండా మోటో కంపెనీ గ్రేటర్ నోయిడాలో 1997లో ప్లాంటును ప్రారంభించింది. ప్లాంట్‌ను క్లోజ్ చేసినప్పటికీ కంపెనీ కార్పోరేట్ కార్యాలయం, స్పేర్ పార్ట్స్ డివిజన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రం వంటి ఇతర కార్యకలాపాలు యథాతథంగా కొనసాగనున్నాయి. అయితే దీనిపై హోండా కంపెనీ స్పందించాల్సి ఉన్నది. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోను, కన్స్యూమర్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ సేల్స్ ఆశాజనకంగా ఉన్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ రాజేష్ గోయల్ అన్నారు.

దేశీయ అవసరాల కోసం అవసరమైన పూర్తి ఉత్పత్తికి ఇక నుంచి హీరో కార్ప్ రాజస్థాన్‌లోని తపుకారా ఫెసిలిటీపై ఆధారపడనుందని తెలుస్తున్నది. ప్లాంట్‌లో ఉత్పాదక, సామర్థ్యాన్ని పెంచేందుకు హీరో కార్స్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అసోసియేట్స్‌లో స్వచ్చంధ పదవీ విరమణ (వీఆర్ఎస్) స్కీంను ప్రవేశ పెట్టింది. గ్రేటర్ నోయిడా ప్లాంటులో సిటీ, సీఆర్-వీ, సివిక్ వంటి వివిధ మోడల్స్‌ను ఉత్పత్తి చేసింది. సంవత్సరానికి లక్ష యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

రాజస్థాన్ తపుకుర ఫెసిలిటీ ఏడాదికి 1.8 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్లాంట్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే ఇంజిన్లను ఉత్పత్తి చేస్తుంది. హెచ్సీఐఎల్ నవంబర్ నెలలో దేశీయ మార్కెట్లో 9,990 యూనిట్లను విక్రయించింది. 2019 నవంబర్‌లో 6,459 యూనిట్లు కాగా, గత ఏడాదితో పోలిస్తే 55 శాతం పెరిగింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లోని ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోవడం లేదా రాజస్థాన్ ప్లాంటుకు ట్రాన్స్ ఫర్ కావాల్సి ఉంటుంది. 

 

 లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి


logo