Asaduddin Owaisi | హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల దేశానికి హాని కలుగుతుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం పట్ల వివక్ష చూపిస్తున్నారని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్సభలో ఎంపీ ఓవైసీ మాట్లాడుతూ.. నిన్న సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశం కంటే హిందుత్వమే ప్రధానికి ముఖ్యమైనట్లు ఉందన్నారు. క్విట్ ఇండియా పదం మొదట ఉపయోగించింది ఓ ముస్లిం. ఈ విషయం తెలిస్తే అమిత్ షా ఆ పదాన్ని ఉపయోగించరేమో. ప్రధాని మోదీ ముస్లింల పట్ల వివక్ష చూపించడంతో పాటు ముస్లింలకు కేటాయించాల్సిన నిధుల్లో కోత పెట్టారు. స్త్రీ రక్షణ గురించి మాట్లాడుతున్న మోదీ.. గుజరాత్లో బిల్కిస్ బానోకు ఎందుకు న్యాయం చేయట్లేదు..? అని ఓవైసీ ప్రశ్నించారు.