Himachal Pradesh | భారీ వర్షాలు, వరదలతో రూ.8 వేల కోట్ల మేర నష్టం: హిమాచల్ సీఎం సుఖ్విందర్
హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు (Heavy rains) కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు (Floods) పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వంద మందివరకు మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (CM Sukhvinder Singh Sukhu) వెల్లడించారు.
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు (Heavy rains) కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు (Floods) పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వంద మందివరకు మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (CM Sukhvinder Singh Sukhu) వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమకు ఆర్థిక సహాయం (Financial Relief) చేయాలని కోరారు. వర్షాల తర్వాత కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిందని చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం (Union Government) చెల్లించాల్సిన విపత్తు నిధులు (Disaster fund) రూ.315 కోట్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశామన్నారు. వర్షాలు, వరదలతో రూ.8 వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనావేశామని తెలిపారు.
సాధ్యామైన త్వరగా రోడ్లు, విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత ఆపత్కాలంలో కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సన్నద్ధమై ఉందని చెప్పారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. విపత్తు వేళ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ (Jai Ram Thakur) రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

