మేము జోక్యం చేసుకోలేం: పోలీసులు
మంగళూరు (కర్ణాటక), మే 30: కర్ణాటకలో హిజాబ్ వివాదం మళ్లీ రాజుకుంటున్నది. మం గళూరు యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వాళ్లు దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు. హిజాబ్ ధరించి కాలేజీలోకి వెళ్లేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ఆయన హిజాబ్‌గానీ, కాషాయ కండువాలుగానీ ధరించి కాలేజీలోకి రాకూడదంటూ అధికారులు తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సమాధానమిచ్చారు. అంతేగాక డ్రెస్‌కోడ్‌ను పాటించాలంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు.