కృష్ణగిరి : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ చర్యను నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ముందు నిరసన తెలిపారు. బాలిక తల్లి సోమవారం పాఠశాలకు వచ్చి జనవరి 3 నుంచి తన బిడ్డ సిక్ లీవ్ పెట్టి స్కూల్‌కు రాకున్నా పాఠశాల యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది.
దీంతో హెడ్మాస్టర్ బాలిక ఇంటికి వెళ్లగా, జనవరి 2, 3 తేదీల్లో తనపై ముగ్గురు ఉపాధ్యాయులు లైంగిక దాడి చేశారని, అందులో ఇద్దరు తన క్లాస్ టీచర్లేనని బాధిత బాలిక తెలిపింది. బాలికపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో స్టాలిన్ సర్కార్‌పై విపక్షాలు ధ్వజమెత్తాయి.