న్యూఢిల్లీ, మే 3: ప్రముఖ బిలీనియర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఆ సంస్థలో పనిచేసే వారిలో ఎవరెవరి ఉద్యోగాలు ఊడుతాయనే చర్చ ముందుకు వచ్చింది. ఈ జాబితాలో ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్, కంపెనీ లీగల్ హెడ్ విజయ గద్దె పేర్లు ప్రధానంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
వీరిద్దరి స్థానాల్లో కొత్తవారిని తీసుకొచ్చే ప్రణాళికలో మస్క్ ఉన్నారని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సీఈవోగా మస్క్ ఇప్పటికే ఒకరిని ఎంపిక చేసుకున్నారని సమాచారం.