తమిళనాడులో మాండస్ బీభత్సం
మాండస్ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి.
- చెన్నై, సమీప జిల్లాల్లో భారీ వర్షాలు
- నలుగురు మృతి
చెన్నై, డిసెంబర్ 10: మాండస్ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. మహాబలిపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటిన తుఫాను.. తర్వాత క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. చెన్నై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తుఫాను తీరం దాటుతున్న సమయంలో గంటలకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దాదాపు 400 వృక్షాలు నేలకూలాయి. చెట్లు కరెంట్ స్తంభాలపై పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. దాదాపు 9 వేల మంది తుఫాను ప్రభావిత ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించారు. వర్షం సంబంధిత ఘటనల్లో నలుగురు మరణించారని, 181 ఇండ్లు ధ్వంసమయ్యాయని సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. అధికారులు విరిగిపడిన చెట్లను తొలగించి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే పనిలో ఉన్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

