Heavy Rain | తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Heavy Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది.
Heavy Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం పూర్తిగా నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అయితే, నేడు కురిసిన భారీ వర్షానికి తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (India Meteorological Department) తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లో మాత్రం రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అంతేకాకుండా, రాబోయే ఐదు రోజుల పాటు రాయలసీమ, కేరళలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read..
Supreme Court | కేజ్రీవాల్ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
PM Modi | రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ చేరుకున్న ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

