బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 20:26:41

చర్మ సౌందర్యాన్నిపెంచే కుంకుమపువ్వు

చర్మ సౌందర్యాన్నిపెంచే కుంకుమపువ్వు

హైదరాబాద్: కుంకుమపువ్వును పలు వంటకాలలో వాడతారు. దీని వల్ల వంటకాల రుచి పెరగడంతో పాటు అందాన్ని కూడా పెంచుతుంది .   చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు చర్మ సంరక్షణకి ఎంతగానో సహాయపడతాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకుని, సులభంగా వాడే విధంగా ఉంటాయి. చర్మ సంరక్షణకు ఉపయోగించే పదార్ధాలలో కుంకుమ పువ్వు అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్ధం. కుంకుమ పువ్వుని అనేకరకాల ప్రాడక్ట్స్ లో కూడా ఉపయోస్తారు. ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఏ కాలంలో అయినా మృదువైన, తేమతో కూడిన చర్మాన్ని అందిస్తుంది.

ఒక గిన్నెలో చిటికెడు కుంకుమ పువ్వు, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి దీనిని ముఖం మీద, మెడకు మాస్క్ వేసుకుని కొన్ని నిమిషాల తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోవాలి. మచ్చలేని చర్మం కోసం వారంలో రెండుసార్లు వేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం, రెండు, మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలలో అప్లై చేయండి. ముఖంపై మాస్క్ ఆరిన తర్వాత ముఖాన్ని కడగండి.

మంచి రిజల్ట్ కోసం వారంలో కనీసం రెండుసార్లు ఈ ప్యాక్ వాడండి. పాలు మీ చర్మానికి తక్షణ మెరుపుని అందిస్తుంది. ఎండ, పొల్యూషన్ కారణంగా కోల్పోయిన మీ సహజ కాంతిని తిరిగి పొందాలనుకుంటే ఈ ప్యాక్ మీకు హెల్ప్ చేస్తుంది. చిటికెడు కుంకుమ పువ్వు కలిపిన నాలుగు టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని ముఖం, మెడపై రాసుకుని ఆరిన తర్వాత నీటితో క్లీన్ చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం రోజుకో మారురాయాలి.


logo