Human Brain | న్యూఢిల్లీ: పిల్లలున్నవారి మెదడు యవ్వనంగా ఉంటుందని, అంత త్వరగా వృద్ధాప్యం చెందదని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో కథనం ప్రచురితమైంది. రట్జర్స్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ హ్యూమన్ బ్రెయిన్ ఇమేజింగ్ రిసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనంలో సుమారు 37 వేల మంది పాల్గొన్నారు.
తల్లిదండ్రుల మెదడు పనితీరుపై జరిగిన అతిపెద్ద అధ్యయనం ఇదే కావడం గమనార్హం. పిల్లల్ని కనడం, పెంచడం ఒత్తిడితో కూడుకున్నదని ఒక అపోహ ఉన్నది. అయితే, తాజా అధ్యయనంలో అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. ఇందులో సుమారు 17 వేల మంది పురుషులు కూడా పాల్గొన్నారు. తండ్రుల ఆరోగ్యంపై కూడా పిల్లల ప్రభావం ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.