Candy Crush Parantha | మామూలుగా పరాటాలు దేనితో చేస్తారు. గోదుమ పిండి, మైదా పిండితో చేస్తారు. కానీ.. ఈ పరాటా మాత్రం స్పెషల్ పరాటా. దీన్ని దేనితో చేస్తారో తెలుసా? కాండీ క్రష్‌తో. అదేంటి.. కాండీ క్రష్ అంటే గేమ్ కదా అంటారా? అక్కడే మీరు పప్పులో కాలేశారు. కాండీ క్రష్ అనేది గేమ్.. కానీ.. రియల్‌గా అది స్వీట్. జెల్లీ, తేనె, తూటీ ఫ్రూటీ, డ్రైఫ్రూట్స్ అన్నీ కలిపి దాన్ని తయారు చేస్తారు.
దానితో పరాటా తయారు చేస్తారన్నమాట. ఢిల్లీలోని పరాటా వాలీ గల్లీకి వెళ్తే.. రకరకాల పరాటాలు కనిపిస్తాయి. అందులో కాండీ క్రష్ పరాటా ఒకటి. కాండీ క్రష్ పరాటాను చూసిన ఫుడ్ బ్లాగర్ చాహత్ ఆనంద్.. దాన్ని టేస్ట్ చేసింది. వెంటనే ఆ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. కాండీ క్రష్ పరాటా తినాలంటే ఇక్కడి రండి.. ముఖ్యంగా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో చాహత్ తెలిపింది.
ఈ వెరైటీ డిష్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ వెరైటీ డిష్‌ను చూసి ఇదెక్కడి డిష్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.